హైదరాబాద్: కరోనా వైరస్ 2020 మారిలో వ్యాపించడంతో రైల్వేస్ దాదాపు 4 కోట్ల మంది సీనియర్ సిటిజన్‌లకు ఇచ్చే కన్సెషన్లను రద్దు చేసి వారు టిక్కెటు పూర్తి ఫేర్‌ను చెల్లించేలా చేసింది. ఈ విషయాన్ని ‘రైట్ టు ఇన్ఫార్మేషన్’ (ఆర్‌టిఐ) తన జవాబులో పేర్కొంది. కాగా దీనిపై రాష్ట్ర మంత్రి కె తారక రామారావు కేంద్ర రైల్వే మంత్రిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. అందులో ఆయన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇది చాలా దురదృష్టకర పరిస్థితి. సాయం, మద్దతు, గౌరవం లభించాల్సిన కోట్లాది సీనియర్ సిటిజన్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దయచేసి మీ నిర్ణయాన్ని పునః సమీక్షించండి అని పేర్కొన్నారు.
VerY unfortunate situation Railway Minister @AshwiniVaishnaw Ji
Please review the decision in the interest of crores of senior citizens who deserve our assistance and respect https://t.co/cNvbyHx0oH
— KTR (@KTRTRS) November 23, 2021