Sunday, January 19, 2025

నేడు కెసిఆర్ పొలం బాట

- Advertisement -
- Advertisement -

రైతులకు బాసటగా కెసిఆర్ జిల్లాల పర్యటన

నేడు సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో
ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్న కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : సాగునీరు అందక పంటలు ఎండిపోయి, అకాల వర్షాలతో దెబ్బతిని అల్లాడుతున్న రైతాంగానికి ధైర్యాన్ని నూరిపోసేందుకు బిఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. ఆయన నేరుగా రైతుల వద్దకు వెళ్లి, రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించనున్నారు. ఆదివారం సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లోని పలు మండలాల్లో కెసిఆర్ పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు.

కెసిఆర్ పర్యటన షెడ్యూల్ ఇదే..

ఆదివారం ఉదయం 8:30 గంటలకు కెసిఆర్ ఎర్రవెల్లి నుంచి జిల్లాల పర్యటనకు రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. జనగామ జిల్లాలోని ధరావత్ తండాకు ఉదయం 10.30 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. 11.30 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం, అర్వపల్లి మండలం, సూర్యాపేట రూరల్ మండలాల్లో పర్యటించి, ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు సూర్యాపేట రూరల్ మండలం నుంచి బయల్దేరి.. 1.30 గంటల వరకు సూర్యాపేట నియోజకవర్గంలోని ఎంఎల్‌ఎ క్యాంపు ఆఫీసుకు చేరుకుంటారు.

మధ్యాహ్నం 2 గంటలకు ఎంఎల్‌ఎ క్యాంపు ఆఫీసులోనే భోజనం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఎంఎల్‌ఎ క్యాంప్ ఆఫీసు నుంచి నల్లగొండ జిల్లాకు బయలుదేరుతారు. సాయంత్రం 4.30 గంటలకు నిడమనూరు మండలానికి చేరుకుని ఎండిపోయిన పంటలను పరిశీలించనున్నారు. సాయంత్రం 6 గంటలకు నిడమనూరు నుంచి ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు. రోడ్డు మార్గం గుండా ప్రయాణించి రాత్రి 7 గంటలకు కెసిఆర్ ఎర్రవెల్లికి చేరుకోనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News