Monday, December 23, 2024

జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ కెసిఆర్ సైకత శిల్పం…

- Advertisement -
- Advertisement -

జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ కెసిఆర్ సైకత శిల్పం…

పూరిలో ఏర్పాటు చేయించిన ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్

ఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ జగన్నాథుడు కొలువు తీరిన పూరీ పవిత్ర నగరంలో కెసిఆర్ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ నేత అలిశెట్టి అరవింద్ కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సైకత శిల్పి సాహు చేత శిల్పాన్ని రూపొందింపజేశారు. 14 ఏళ్ల పాటు అలుపెరుగని పోరాటంతో తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కెసిఆర్ అనంతరం తెలంగాణను దేశానికే మార్గదర్శిగా తీర్చిదిద్దారని అరవింద్ ప్రశంసించారు. అదే తరహాలో దేశ భవిష్యత్తును సైతం మార్చగల సత్తా కలిగిన మహోన్నత నేత కెసిఆర్ అని కొనియాడారు.

దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన ఇప్పటికీ రైతులు ఇతర వర్గాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారంటే కాంగ్రెస్, బిజెపిల పాలన వైఫల్యాన్ని గుర్తించిన కెసిఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధపడ్డారన్నారు. యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్న వేళ దేశ గతిని సైతం మార్చేందుకు నడుం బిగించిన తమ నాయకుడికి వినూత్న రీతిలో ఆహ్వానం పలికేందుకే సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించినట్లు తెలిపారు. అద్భుతంగా తీర్చిదిన శిల్పాన్ని వీక్షించేందుకు పూరీలోని స్థానికులు పర్యాటకులు ఆసక్తి కనబరిచారు. భవిష్యత్తు నాయకుడు అంటూ ఫోటోలు తీసుకుని సామాజిక మాధ్యమాలలో పోస్టు పెట్టుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అరవింద్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News