Monday, December 23, 2024

చిమ్మ చీకట్ల నుంచి నిరంతర వెలుగులు నింపిన కెసిఆర్ : సుభాష్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

చర్లపల్లి: తెలంగాణ రాష్ట్రాన్ని చిమ్మ చీకటి నుంచి నిత్య వెలుగులతో అభివృద్ధి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసిఅర్‌కు దక్కుతుందని అన్నారు. తెలంగాణ అవిర్భా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ నోమ ఫంక్షన్‌హాల్‌లో విద్యత్ ప్రగతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బేతిసుభాష్‌రెడ్డి విద్యుత్ ఎస్‌ఈ రాముడితో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిపై డాక్యుమెంటరీని ప్రదర్శించారు. విద్యుత్ రంగం సాధించిన పలు అంశాలను విద్యుత్ అధికారి రాముడు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసిఅర్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం నిత్యం విద్యుత్ కోతల నుంచి రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందించే స్థాయికి చేరుకుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నిత్యం పవర్‌హలీడేలతో ఇబ్బంది పడ్డ పారిశ్రామికవేత్తలకు నేడు నాణ్యమైన రాయితితో కూడిన విద్యుత్ అందుతుందని తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడే నాటికి నాలుగు వేల నాలుగు వందల మేగవాట్ల విద్యుత్ అందితే నేడు తొమ్మిది వేల ఐదు వందల ఎనభై రెండు మేగవాట్ల విద్యుత్ త్పత్తి జరుగుతుందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా లాండ్రీలకు, హెయిర్ కటింగ్ షాపులకు ఉచిత విద్యుత్, ఫౌల్ట్రీ రంగానికి రాయితీతో కూడిన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా ఉప్పల్ నియోజకవర్గంలో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో పాటు విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హబ్సీగూడ డిఈ సాయిప్రసాద్, కన్‌స్ట్రక్షన్ డిఈ సత్తమ్మ, ఎడిఈలు బాలక్రిష్ణ, సతీష్, దశరత్, వీరారెడ్డి, కాప్రా, ఉప్పల్ సర్కిల్ కమిషనర్లు శంకర్, అరుణకుమారి,నాచారం సిఐ నందీశ్వర్‌రెడ్డి, మీర్‌పేట్ హెచ్‌బి కాలనీ, మల్లాపూర్ డివిజన్ల కార్పొరేటర్లు జేరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్‌రెడ్డి, వివిధ విభాగాల అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News