Monday, December 23, 2024

రైతు బాంధవుడు కెసిఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడం ఖాయం

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి:భారత దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలో ఉచితంగా 24 గంటలు వ్యవసాయ రంగానికి ఇస్తున్న రైతు బాంధవుడు కెసిఆర్ తెలంగాణ రైతుల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. బుధవారం బొమ్మలరామారం మండలంలోని చీకటి మామిడి గ్రామ రైతు వేదికలో జరిగిన రైతు సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరైనారు.

ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ రైతాంగానికి మూడు గంటలు కరెంటు ఇస్తామన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కావాలో ఉచితంగా రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇస్తున్న కెసిఆర్ ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ పార్టీ కావాలో రై తులే తేల్చుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా రైతు సదస్సులో పాల్గొన్న రైతులు 24 గంటల ఉచిత విద్యుత్ పై తమ అనుభవాలను సదస్సులో పాలుపంచుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిమ్ముల సుధీర్ రెడ్డి సింగిల్ విండో చైర్మన్ గుదే బాలనరసింహ బోనగిరి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుశంగల సత్యనారాయణ చీకటి మామిడి సర్పంచ్ మచ్చ వసంత శ్రీనివాస్ గౌడ్ మర్యాల సర్పంచ్ దామోదర్ గౌడ్ నాగినేనిపల్లి సర్పంచ్ బీరప్ప తో పాటు టిఆర్‌ఎస్ నాయకులు కొండోజు ఆంజనేయులు వడ్లకొండ ఆనంద్ స్వయంప్రభ మన్నే శ్రీధర్ రాగుల బలరాం తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News