Thursday, January 23, 2025

తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్వాన్ని చాటిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: తెలంగాణ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని దశదిశలా చాటేలా పుణ్య క్షేత్రాలను అభివృద్ధి చేస్తున్న సిఎం కెసిఆర్ అని దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ఆథ్యాత్మిక దినోత్సవం పీఏపల్లి మండలం కోదండాపురం గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ సమైక్యపాలనలో ఆదరణలేక ప్రభావాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పూర్వవైభవం సంతరించుకుంటున్నాయి అన్నారు. కెసిఆర్ సర్కార్ కృషితో ఓ వెలుగు వెలుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల్లోనూ ఆధ్యాత్మికత వెల్లివిరస్తుందన్నారు. భూలోక వైకుంఠం యాదగిరి దివ్యక్షేత్రం.. అద్బుతమైన శిల్పకళతో యదాద్రి దేవాలయం పునర్నిర్మాణం చేయడం జరిగిందన్నారు. గుడి నుంచి పెద్ద ఆలయాల వరకు దూపదీప నైవేద్యం పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి వంగాల ప్రతాప్‌రెడ్డి, పిఏసిఎస్ ఛైర్మన్ వెలుగూరి వల్లపురెడ్డి, మాజీ మార్కెట్‌కమిటీ ఛైర్మన్ ముచ్చర్ల ఏడుకొండల్‌యాదవ్, బిఆర్‌ఎస్ మండల ప్రధాన కార్యదర్శి తోటకూరి పరమేష్, సర్పంచుల ఫోరం అధ్యక్షులుమునగాల అంజిరెడ్డి, పిఏసిఎస్ ఛైర్మన్ శిసనవాడ శ్రీను, అర్వపల్లి నర్సింహ, రేటినేని ముత్యపురావు, రంగారెడ్డి, లచ్చిరెడ్డి, బొడ్డుపల్లి మహేందర్, ఎర్ర యాదగిరి, స్థానిక సర్పంచి మైనం రాణివెంకటయ్య, స్థానిక ఎంపిటిసి మైనం సంధ్య, ఎంపీడీవో, తహసీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News