Saturday, December 21, 2024

నేడు ఆస్పత్రి నుంచి కెసిఆర్ డిశ్చార్జి

- Advertisement -
- Advertisement -

నందినగర్ లోని ఇంటికి వెళ్లనున్న మాజీ సిఎం
పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం !
మన తెలంగాణ/హైదరాబాద్ : బాత్‌రూంలో జారిపడి గాయం కావడంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ సిఎం కెసిఆర్ శుక్రవారం డిశ్చార్జ్ కానున్నారు. అనంతరం అక్కడి నుంచి నంది నగర్ ఇంటికి వెళ్లనున్నారు. దాదాపు ఆరు రోజులుగా యశోద ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న కెసిఆర్ ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో ఆస్పత్రి వర్గాలు ఇంటికి వెళ్లడానికి పర్మిషన్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పుడు కెసిఆర్ ఆరోగ్యం బాగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం కెసిఆర్‌ను డిశ్చార్జ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే కెసిఆర్ ప్రగతి భవన్‌ను ఖాళీ చేశారు. ఫామ్ హౌస్‌కు వెళ్లారు. అయితే వైద్య సేవల కోసం ఫామ్ హౌస్ దూరంగా ఉండటంతో ఆయన సిటీలోని తన ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. నంది నగర్‌లో ఇంటిని యుద్ధప్రాతిపదికన బాగు చేసినట్లుగా తెలుస్తోంది. హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకున్న బిఆర్‌ఎస్ చీఫ్, మాజీ సిఎం కెసిఆర్ వాకర్ సాయంతో డాక్టర్ల పర్యవేక్షణలో నడుస్తున్నారు. హాస్పిటల్‌లోని తన రూమ్‌లో వాకర్‌తో కెసిఆర్ నడుస్తున్నారు. వేగంగా రికవరీఅవుతున్నారని వెల్లడించారు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేయిస్తామని, ఆయన మెడికల్‌గా స్టేబుల్‌గా ఉన్నారని, నార్మల్‌ఫుడ్ తింటున్నారని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ చేయాల్సి ఉంటుందని, శరీరం ఇట్లాగే సహకరిస్తే వేగంగా ఆయన సొంతంగా నడిచే అవకాశం ఉంది. పరిస్థితి క్రమంగా మెరుగుపడుతూం డటంతో ఇక ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదని డాక్టర్లు భావిస్తున్నారు.

ఆస్పత్రిలో ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున పరామర్శించేందుకు ప్రముఖులు వస్తున్నారు. వారితో యశోదాలో రోగులకు ఇబ్బంది ఎదురవుతోంది. రావొద్దని కూడా కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కెసిఆర్‌కు ఆపరేషన్ నొప్పి తగ్గి, సాధారణ నొప్పి మాత్రమే ఉన్నదని, ఆయన శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. సాధారణ ఆహారమే తీసుకుంటున్నారని పేర్కొన్నారు. బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు కూడా చేయిస్తున్నామని చెప్పారు. మరికొన్ని రోజులు ఫిజియోథెరపీ కొనసాగించాల్సి ఉంటుందని ప్రకటించారు. వారం కిందట ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌లో కెసిఆర్ జారిపడటంతో ఆయనను సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌కు కుటుంబ సభ్యులు తరలించారు. సీటీ స్కాన్ చేసిన డాక్టర్లు తుంటి ఎముక విరిగినట్టుగా గుర్తించారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి రాత్రి హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. కేంద్ర మంత్రిగా ఉన్న సమయమంలోనూ కెసిఆర్ ఓ సారి ఢిల్లీలో బాత్ రూంలో జారి పడ్డారు. దాంతో అప్పుడు కూడా ఆయనకు తుంటి ఆపరేషన్ జరిగింది. ఈ సారి రెండో వైపు ఆపరేషన్ జరిగింది. అయినా కెసిఆర్ మానసికంగా ధృడంగా ఉన్నారని ఆస్పత్రిలో పుస్తకాలు చదువుతున్నారని ఎంపి సంతోష్‌రావు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News