Sunday, December 22, 2024

శోభకృత్ నామ ఉగాది శుభాకాంక్ష‌లు తెలిపిన ముఖ్యమంత్రి కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ : రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ముఖ్య‌మంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కెసిఆర్) ‘శోభ‌కృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. వ్య‌వ‌సాయ సంవ‌త్స‌రంగా ప‌రిగ‌ణించే ఈ ఉగాది రైతుల‌కు, ప్ర‌జ‌ల‌కు అన్ని రంగాల్లో శుభాల‌ను చేకూర్చాలి అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

తాగు, సాగునీరు, ప‌చ్చ‌ని పంట‌ల‌తో తెలంగాణ‌లో నిత్య వ‌సంతం నెల‌కొంది అని తెలిపారు. వ్య‌వ‌సాయ రంగ అభివృద్ధితో అనుబంధ రంగాలు, వృత్తులు బ‌ల‌ప‌డి రాష్ట్రంలో గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌రిపుష్ట‌మైంది. తెలంగాణ ప్ర‌గ‌తి దేశానికే ఆద‌ర్శంగా నిలిచింది. శోభ‌కృత్ నామ సంవ‌త్స‌రంలో తెలంగాణ‌తో పాటు,  దేశం మ‌రింత అభివృద్ధి సాధించాలి అని కెసిఆర్ ఆకాంక్షించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News