Saturday, November 23, 2024

మహిళల అభివృద్దికి సిఎం కెసిఆర్ ఎనలేని కృషి

- Advertisement -
- Advertisement -
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో గిరిజన, మహిళ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్

హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన 9 సంవత్సరాల్లో మహిళల అభివృద్ధికి, సంక్షేమానికి సిఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టారని రాష్ట్ర,గిరిజన,మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మంగళవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రవీంద్ర భారతిలో నిర్వహించిన తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీతో కలిసి హాజరయ్యారు.

ఈసందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడతూ తల్లి,తండ్రి మనసు రెండు కలిగి ఉన్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ గత నాయకుల పాలనలో మంచినీటి కోసం మహిళలు బిందెలు పట్టుకొని రోడ్లమీదకు వచ్చి ఇబ్బందులు పడ్డా వారికోసం నీళ్లు తేవాలని సోయి వారికి రాలేదన్నారు. ప్రతీ ఇంటికి ప్రతిరోజు సురక్షిత మంచినీరు అందుతుందన్నారు. అమ్మాయి పుట్టగానే కేసీఆర్ కిట్ పథకంతో మొదలుకొని పెండ్లికి ఆర్థిక సాయాన్ని అందిస్తూ అనుక్షణం రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమానికి అండగా నిలుస్తుందన్నారు.

మనసున్న మనిషి పాలకుడగా ఉంటేనే ఇలాంటి సంక్షేమ పథకాలు అమల్లోకి వస్తాయని అంగన్వాడీల ద్వారా గర్భిణీలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా 260 కోట్లు ఖర్చుపెట్టి న్యూట్రిషన్ కిట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని రాష్ట్రంలో మాత శిశు మరణాల రేటు 92 నుండి 47 కు తగ్గిందని తెలిపారు. కల్యాణ లక్ష్మి ద్వారా ఈ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలకు రూ. 11 వేల కోట్లు అందించినట్లు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు పింఛన్లు అధిస్తున్న నాయకుడు కేసీఆర్‌నన్నారు. అంగన్వాడి టీచర్ల గౌరవ వేతనాలు అంగన్వాడీ టీచర్లను గౌరవించి, గతంలో రూ. 4,200 ఉన్న జీతాలను రూ. 13,650కి పెంచినట్లు చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో పర్యటించినప్పుడు రాష్ట్రంలో మహిళల సంక్షేమం భద్రత పట్ల తీసుకుంటున్న చర్యలకు ఆకర్షితులైతున్నారు.

మన సంక్షేమ పథకాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని మహిళలకు రిజర్వేషన్ 50% కల్పించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి అభివృద్ధి గురించి ఆలోచించి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం మన అదృష్టమని, కోవిడ్ సమయంలో మహిళా విదేశీ సంక్షేమ శాఖ అందించిన సేవలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. తలాపునే గోదావరి ఉన్నా మంచి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచన ఎవరికి రాలేదు. గతంలో గిరిజన కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే అమ్ముకునే పరిస్థితి ఉండేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ప్రసంగిస్తూ తెలంగాణ వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళలకు 33 శాతం రిజ్వేషన్లను అమలు చేస్తున్నారని వెల్లడించారు.మహిళల భద్రత కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సభ ప్రారంభానికి ముందు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు సభికులను అలరించాయి. ఈసందర్భంగా మంత్రులు మహిళాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన మహిళల ఉత్పత్తుల స్టాల్స్ ను మంత్రులు సందర్శించారు. ఇంటర్, పాలీసెట్ తో పాటు వివిధ రంగాల్లో ప్రతిభకనబరిచిన విద్యార్థులకు మంత్రి బహుమతులు అందజేశారు. అదే విధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శవంతమైన మహిళ శిశు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని, ఆడపిల్ల అంటే అబార్షన్ చేసుకునే సంస్కృతి నుంచి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అనే స్థాయికి వచ్చామన్నారు.

మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ముందు వరుసలో ఉండాలనే విధంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని కొనియాడారు. అన్ని శాఖల్లో 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయడం గొప్ప విషయమని సీఎం కేసీఆర్ అందిస్తున్న ప్రోత్సాహంతో అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్, బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ జే శ్రీనివాసరావు, సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్, మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ శిఖ గోయల్ మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ కార్యదర్శి భారతి హోలీకేరి, మహిళా అభివృద్ధి శి సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News