ఎల్బీనగర్: మహిళల స్వావలంబన, సాధికారత కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ఆవిరళ కృషి చేస్తున్నారని ఎల్బీనగర్ ఎంఎల్‌ఎ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చింతలకుంట ప్రల్లవి గార్డెన్స్‌లో తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఒంటరి మహిళలకు పింఛన్లు, కేసిఆర్ కిట్, న్యూటిషన్ కిట్, ఆరోగ్య మహిళా తదితర సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభు త్వం తెలంగాణలో అమలు జరుగుతున్నాయని తెలిపారు.
త్వరలో గృహలక్ష్మీ పేరిట ఇల్లు నిర్మాణం చేపట్టేందుకు రూ.3లక్షలు ఆర్థిక సహాయం, షీటీమ్స్, భరోసా కేంద్రాలు ఏర్పాటు, మార్కెట్ కమిటీల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రకటించారని, ఆడబిడ్డ పుట్టిందంటే అమ్మో పరిస్థితి, ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపా రు. స్వయం సహాయక సంఘాల సభ్యులు వ్యా పారులుగా, చిన్న తరహా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని మహిళల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అండంగా నిలుస్తుందన్నారు.
ఈకార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే మల్లేశం, దయానంద్ గుప్తా, జోనల్ కమిషనర్ పంకజ, హయత్‌నగర్ , సరూర్‌నగర్ డిప్యూటీ కమిషనర్లు మారుతి దివాకర్, హరికృష్ణయ్య, హయత్‌నగర్ ఏంఆర్‌ఓ సంధ్యారాణి, డిప్యూటీ టౌన్ ప్లానర్ సుష్మితా, అశ్విని, కృష్ణవేణి, సృజన, నాయకులు ఈశ్వరమ్మ యా దవ్, కోసనం ధనలక్ష్మీ వెంకట్‌రెడ్డి , జక్కడి రఘువీర్‌రెడ్డి , మహిళా అధ్యక్షురాలు, మహిళలు , తదితరులు పాల్గొన్నారు.