Monday, December 23, 2024

పేదవారికి కార్పొరేట్ వైద్యం అందించడమే కెసిఆర్ లక్ష్యం

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో పేదవారికీ కార్పొరేట్ వైద్యం అందించడమే సిఎం కెసిఆర్ లక్ష్యం అని ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం పంచాయతీ పరిధిలోని సత్యనారాయణపురం గ్రామంలో గల రామ్ లీలా ఫంక్షన్ హాల్ లో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కందాళ ముఖ్యఅతిథిగా హాజరై ప్రాంగణంలో జ్యోతిని ఏర్పాటు చేయగా ప్రజ్వలన చేశారు. తొలుత వైద్య ఆరోగ్య శాఖ ద్వారా కలిగిన వైద్య సదుపాయాలను గురించి లబ్ధిదారులు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వ దవాఖానాకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందించాల్సిన బాధ్యత వైద్యులు సిబ్బందిపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాతనే వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం అయ్యిందన్నారు. నాడు సర్కారు దవాఖానాకు వెళ్లాలంటే ప్రజలు భయపడేవారు అని కానీ ఇప్పుడు సర్కారు దవాఖానకు ప్రజలు వెళుతున్నారన్నారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి మెరుగైన సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో సాధ్యమైందన్నారు. అంతేకాకుండా పేదలకు బస్తీ దవాఖానాల ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గర్భిణీలు సుఖప్రసవాలు జరిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఆడబిడ్డకు రూ.13వేలు మగ బిడ్డకు రూ. 12వేలు ప్రోత్సాహకాన్ని అందిస్తూనే కెసిఆర్ కిట్టు కూడా ఇస్తున్నట్టు పేర్కొన్నారు.

గర్భిణీలకు అంగన్‌వాడీల ద్వారా పౌష్టికాహారం, కడుపులోని శిశువుకు టీకాలను వేస్తూనే నగదు ప్రభుత్వం అందజేస్తుందన్నారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుంచి పురుడు పోసుకునేవరకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సూపర్ స్పెషాలిటీ వసతులను కల్పించి వ్యాధి నిర్ధారణ పరీక్ష పరికరాలు, ఆపరేషన్ థియేటర్లు, రక్త పరీక్షలు వంటి ఎన్నో మెరుగైన సేవలను అధునాకరించారన్నారు. ప్రభుత్వాసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలకు జాతీయ గుర్తింపు కూడా లభించిందన్నారు. నీతి అయోగ్ 2019 జనవరిలో రూపొందించిన నివేదికలో తెలంగాణ మూడో స్థానంలో నిలిచిందన్నారు.

ఆరోగ్యశాఖ సిబ్బంది గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే సుఖప్రసవాలు జరిగేలా వారిని ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న సౌకర్యాలను వివరించాల్సిన బాధ్యత మీ పైనే ఉందన్నారు. అనంతరం వైద్యులను సెలవతో సత్కరించి మెమొంటాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు బెల్లం ఉమా, వజ్జ రమ్య, బానోత్ శ్రీనివాస్, బోడామంగీలాల్ ,జడ్పీ వైస్ చైర్ పర్సన్ మరికంటి ధనలక్ష్మి, జడ్పిటిసి ఎండపల్లి వరప్రసాద్, సిపిఐ పార్టీ ఖమ్మం జిల్లా సహాయ కార్యదర్శి దండి సురేష్, బీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బెల్లం వేణు, సుడా డైరెక్టర్ గూడా సంజీవరెడ్డి, ఏదులాపురం సొసైటీ చైర్మన్ జర్పుల లక్ష్మణ్, మరమ్మ గుడి చైర్మన్ మట్టా వెంకటేశ్వర్లు, ఆర్‌ఎస్‌ఎస్ కన్వీనర్ అక్కినపల్లి వెంకన్న, ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్లు ఇంటూరి శేఖర్, చావా వేణు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News