Monday, December 23, 2024

పేదల సంక్షేమానికి కెసిఆర్ నిరంతర కృషి

- Advertisement -
- Advertisement -

ఆత్మకూర్ : పేదల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని, పేదల సంక్షేమమే ముఖ్యమంత్రి ధ్యేయమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల లబ్ధిదారులకు మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షాదీముబారక్, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు 90 మందికి 90 లక్షల పదివేల 440 రూ పాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భ ంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధిలో విజయం సాధిస్తుందని అన్నారు.

కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం పేదలకు వ ం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో రైతులకు రైతుబీ మా, పెట్టుబడి సాయం, ఉచిత విద్యుత్ అందించి ప్రపంచంలోనే మొదటి స్థానంలో రాష్ట్రం నిలిచిపోయిందని దీమా వ్యక్తం చేశారు. దళితుల సం క్షేమం కోసం దళిత బంధు పథకం ప్రవేశపెట్టి ద ళిత బాంధవుడు అయ్యాడని అన్నారు. వచ్చే నెలలో గృహలక్ష్మి పథకం కింద ఇంటి స్థలం ఉన్న ప్రతి ఒక్కరికి మూడు లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని, ప్రజలే నా కుటుంబమని ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానన్నారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే సహపంక్తి భోజనం చేశారు.

* సాయి చంద్ మృతి పట్ల సంతాపం
తెలంగాణ ఉద్యమ సాధకుడు, ప్రజా గాయకుడు, కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్మెన్ సాయిచంద్ గుండెపోటుతో గురువారం మృతి చెందాడు. మృతి పట్ల ఎమ్మెల్యే తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. సభలో మౌనం పాటించారు.

* బండి సంజయ్ నోరు జాగ్రత్త
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మహబూబ్‌నగర్ పార్లమెంట్ మాజీ సభ్యుడు జితేందర్ రెడ్డి అధికార పార్టీపై వ్యాఖ్యలు చేయడం సరికాదని, నోరు జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హెచ్చరించారు. నియోజకవర్గం సాగునీటితో కళకళలాడుతుంటే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ వెంట ఉం టారని అన్నారు.

బిజెపి అభ్యర్థులు నిలబడి డిపాజి ట్ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. కేంద్ర ప్రభు త్వ నిధులు రాష్ట్రానికి తీసుకురాని బిజెపి నాయకులు ముఖ్యమంత్రి కెసిఆర్‌ను విమర్శించడం తగదన్నారు. మీకు దమ్ముంటే రాష్ట్రానికి ప్రజా సంక్షేమానికి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సింధుజ, కమిషనర్ నాగరాజుతో పాటు ఎంపిపి బంగారు శ్రీనివాసులు, జెడ్పిటిసి డాక్టర్ శివరంజని ఆనంద్, వైస్ ఎంపిపి కొటేష్ యాదవ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గాయత్రి రవి కుమార్ యాదవ్, వైస్ చైర్మెన్ విజయ భాస్కర్ రెడ్డి, కౌన్సిలర్లు రామకృష్ణయ్య, చెన్నయ్య, పోషన్న, యాదమ్మ, కో ఆన్షన్ సభ్యులు రియాజ్ అలీ, మహబూబ్ పాషా, జ్యోతి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News