Monday, December 23, 2024

తెలంగాణలో మహిళ సంక్షేమానికి కెసిఆర్ కృషి

- Advertisement -
- Advertisement -
  • సామూహిక శ్రీమంతంలో పాల్గొన్న జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా శర్మ

బెజ్జంకి: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మహిళలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా శర్మ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 106 మంది మహిళలకు సామూహిక శ్రీమంతాలు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అథితిగా జడ్పీ చైర్‌పర్సన్ వేలేటి రోజా శర్మ పాల్గొని మాట్లాడారు.

సంప్రదాయ పద్దతిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మహిళలకు శ్రీమంతం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. సమాజ సేవలో లయన్స్ క్లబ్ ముందు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మల, జడ్పీటీసీ కవిత,సర్పంచ్ మంజుల, ఎఎంసి చైర్మన్ కచ్చు చంద్రకళ, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ రాజిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, భారత్,శ్రీనివాస్, సత్తయ్య, సుదర్శన్ రెడ్డి, కచ్చు రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News