Sunday, December 22, 2024

కెసిఆర్ కుటుంబం వద్ద లక్ష కోట్ల రూపాయల ఆస్తులున్నాయి: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరద బాధితులను పరామర్శించేందుకు సోమవారం రోడ్డు మార్గంలో ఖమ్మం వెళ్లారు. మంగళవారం ఉదయం మహబూబాబాద్ జిల్లాలో వరద నీటిలో కొట్టుకుపోయిన యువ శాస్త్రవేత్త కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ముంపు ప్రాంతాల్లో పర్యటించి మాట్లాడుతూ ప్రభుత్వం అప్రమత్తం వల్లే పెద్ద నష్టం తప్పిందని అన్నారు. కృష్ణ, ఖమ్మం జిల్లాలు పక్కపక్కనే కవల పిల్లలాగే ఉంటాయని వివరించారు.

కృష్ణా జిల్లాలో కంటే ఖమ్మం జిల్లాలోనే రికార్డు స్థాయిలో 42 సెమీ. వర్షపాతం నమోదయందన్నారు. అందుకే విపరీత నష్టం వాటిల్లిందన్నారు. విపత్తుకు కారణమైన మున్నేరు రిటైనింగ్ వాల్ పై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. త్వరలో ఇంజినీర్లతో చర్చిస్తామన్నారు.

భారత రాష్ట్ర సమితి(బిఆర్ఎస్) ప్రభుత్వ హయాంలోనే మిషన్ కాకతీయ పథకంలో భారీగా దోపిడీ జరిగిందన్నారు. అందుకే ఈ స్థాయిలో చెరువులు తెగాయని ఆరోపించారు. వర్షం, వరద కారణంగా నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు ప్రకటించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ. 5430 కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు ప్రభుత్వం అంచనా.

తెలంగాణ రాష్ట్రానికి సాయం చేయాలని రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలపై ఆయన మండిపడ్డారు. కెసిఆర్ కుటుంబం వద్ద లక్ష కోట్ల రూపాయలున్నాయని, ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 2000 కోట్లు ఇవ్వొచ్చు కదా అన్నారు. అమెరికాలో కెటిఆర్ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. హరీశ్ రావు ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు భజన చేస్తున్నాడని విమర్శించారు. త్వరలో అందరి లెక్కలు తీస్తానని, ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఆక్రమణల గుట్టు తేలుస్తానని, హరీశ్ రావు వస్తే నిజ నిర్ధారణ కమిటీ వేస్తానని సవాల్ విసిరారు. ఈటెల రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని కేంద్ర నుంచి నిధులను తెప్పించి, చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News