సమీప అభ్యర్థి ఈటల రాజేందర్‌పై గెలుపు
2018తో పోల్చితే తగ్గిన మెజారిటీ
మన తెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ అధినేత, సిఎం హోదాలో గజ్వేల్ నియోజకవర్గ బరిలో నిలిచిన కెసిఆర్ విజయం సాధించారు. బిజెపి తరపున పోటీ చేసిన ఈటల రాజేందర్‌పై ఆయన గెలిచారు. గజ్వేల్ స్థానంలో కెసిఆర్‌కు ఇది హ్యాట్రిక్ విజయం కావడం గమనార్హం. అయితే 2018 ఎన్నికలతో పోల్చితే ఈసారి కెసిఆర్ మెజారిటీ తగ్గింది. తనకు అన్యాయం జరిగింది కాబట్టి గజ్వేల్‌లో కెసిఆర్‌పై పోటీ చేస్తున్నానని ఈటల రాజేందర్ చెప్పడం, విస్తృతంగా ప్రచారం నిర్వహించడంతో గెలుపు ఎవరిదనే ఉత్కంఠ కొనసాగింది.
అయితే కెసిఆర్‌కే ప్రజలు పట్టం కట్టారు. ఇదిలావుండగా కామారెడ్డిలో కెసిఆర్ అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. బిజెపి తరపున పోటీ చేసిన కాటిపల్లి వెంకట రమణారెడ్డి 5,156 ఓట్ల తేడాతో గెలిచి సంచలనం సృష్టించారు. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, కెసిఆర్‌లపై వెంకట రమణారెడ్డి గెలవడం సంచలనంగా మారింది. కెసిఆర్ రెండవ స్థానంలో, రేవంత్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారు.