Thursday, January 23, 2025

కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి రక్ష

- Advertisement -
- Advertisement -

మోర్తాడ్ : కెసిఆర్ నాయకత్వమే దేశానికి, రాష్ట్రానికి శ్రీరామరక్ష అని పేదలు, రైతులు రెండు కండ్లుగా కెసిఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. కెసిఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బాల్కొండ నియోజక వర్గం మోర్తాడ్‌కు చెందిన నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు తీగల సంతోష్ అతని అనుచరులు హైదరాబాద్‌లో శనివారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు.

వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. బాల్కొండ నియోజక వర్గాన్ని ముఖ్యమంత్రిన కెసిఆర్ దయతో అన్ని విధాల అభివృద్ధి చేసుకున్నామని మంత్రి అన్నారు. సాగునీటి రంగంలో వచ్చిన విప్లవాత్మకమైన మార్పులు, మౌళిక సదుపాయాలు కల్పన, మెరుగైన వైద్య సేవలు, బిటి రోడ్లు గ్రామాల్లో సిసి రోడ్లు, సంక్షేమ పథకాలతో బాల్కొండ నియోజక వర్గం సుభిక్షం అయిందన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఈ సందర్భంగా చెప్పారు.

రోజురోజుకు దేశ వ్యాప్తంగా తెలంగాణ మోడల్ అభివృద్ధి కావాలనే డిమాండ్ పెరుగు తోందన్నారు. అబ్ కి బార్ కిసాన్ సర్కార్ అంటూ దేశ మార్పు కోసం బయలు దేరిన కెసిఆర్‌కి ప్రజల్లోంచి విశేష మద్దతు లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో మోర్తాడ్ మండల జడ్పిటిసి బద్దం రవి, ఎంపిపి శివలింగు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా, ఉపాధ్యక్షుడు సుభాష్, సుంకెట్ సర్పంచ్ కడారి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పృద్వీ, గ్రామ శాఖ అధ్యక్షుడు కె. పరమేష్, బిఆర్‌ఎస్ నాయకులు సందీప్, పిట్ల సత్యం, మాజీ ఎంపిటిసి నవీన్, ఆరిఫ్, సుంకెట్, వార్డు సభ్యుడు ఓంకార్, సొసైటీ వైస్ చైర్మన్ చిరంజీవి, కె. చిన్న రాజన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News