Monday, December 23, 2024

అందరి అభ్యున్నతే కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాల వారి అభ్యున్నతే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధ్యేయమని, అందుకోసమే వివిధ రకాల సంక్షేమఫలాలను ప్రవేశపెట్టి వాటిని సక్రమంగా అందజేయడం జరుగు తుందని హుజూర్‌నగర్ నియోజకవర్గం శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి తెలిపారు.

యాదవకులస్తుల ఆర్ధికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం హుజూర్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల పరిధిలోని లక్కవరం గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన రెండవ విడత గొర్రెలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొర్రెలను పంపిణీ చేయడం ద్వారా పశుసంపద అభివృద్దితోపాటు గొర్రెల పెంపకందారుల జీవితాలలో వెలుగులు నింపడం జరుగుతుందన్నారు.రాష్ట్రంలోని కులవృత్తులపై గౌవరవంతోనే కు లవృత్తిదారులను కెసిఆర్ ప్రభుత్వ పరంగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. గొల్ల,కురుమల ఆర్ధికాభివృద్ధికి గొర్రెల పంపిణీ పధకం తేవడం జరిగిందని పేర్కొన్నారు.

ప్రతిఒక్కరి స్వయం ఉపాధి కల్పనే ప్రభుత్వ లక్షం అన్నారు. ఈ కార్యక్రమంలో హుజూర్‌నగర్ జడ్పిటీసీ కొప్పుల సైదిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, ఎంపీటీసీ కాశమ్మ, పీఏసీఎస్ చైర్మన్ యరగాని శ్రీనివాస్ గౌడ్, పట్టణ బీఆర్‌ఎస్ అధ్యక్షులు చిట్యాల అమర్‌నాద్ రెడ్డి, ప్రధానకార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్, కడియాల రామకృష్ణ, పలువురు లబ్ధిదారులు , బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News