Saturday, December 21, 2024

అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధే కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

కాజీపేట :అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి కోసమే బిఆర్‌ఎస్ ప్రభుత్వం సిఎం కెసిఆర్ లక్ష్యం తో ముందుకు వెళ్తున్నారని, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ అన్నారు. శనివారం కాజీపేట పట్టణంలోని 47 డివిజన్లో సిద్దు టెంట్ హౌస్ మొదటి వార్షికోత్సవ సభ గబ్బెట శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు దాస్యం వినయ భాస్కర్ పాల్గొని కేక్ కట్ చేసారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, దళితులకు గొప్ప వరం దళిత బంధు పథకం అని ముఖ్యమంత్రి కెసిఆర్ దళితుల బతుకులు బాగుపడాలని సమాజంలో దళితులపై చిన్న చూపు ఉన్నదని దళితులు అంటే కూలీలుగా చూసే సమాజంలో దళితులు కూడా ఆత్మగౌరవంతో బతకాలని మన ప్రియతమ ముఖ్యమంత్రి కకెసిఆర్ దళిత బంధు పథకం తీసుకువచ్చినారని అలాగే బీసీ కులవృత్తుల పనిచేసే వారికి లక్ష రూపాయలు గృహలక్ష్మి గృహలక్ష్మి పథకం ద్వారా 3,00000 ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్నాయని ఇక్కడి పథకాలను దేశం అంతటా పేర్లు మార్చి అమలు చేస్తున్నారని కెసిఆర్ పాలన భారతదేశంలో అమలు పరచాలని బి.ఆర్.ఎస్ పార్టీని స్థాపించినారని అలాగే దళిత బంధు వార్షికోత్సవం జరుపుకోవడం శుభ పరిణామం అని తెలియజేసినారు.

కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ టిఆర్‌ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్, ఆర్టిఏ మెంబర్ కాటాపూర్ రాజు, రైతు సమన్వయ కమిటీ నాయకులు సుంచు కృష్ణ, ఎండి అఫ్జల్ శిరుమళ్ల దశరథం బరిగల వినయ్, పాలడుగుల శివకుమార్, పాలడుగుల రామస్వామి మనోహర్ గబ్బెట కరుణ్ కొండ్ర శంకర్, సిరిల్ లారెన్స్ బొల్లె కుమారస్వామి, పెయింటర్ యూనియన్ అధ్యక్షులు గబ్బెట ఎల్లేష్ సిలివేరు మల్లికార్జున్, సిరిపాక కుమార్ మెహమూద్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News