Monday, December 23, 2024

వెనకబడిన తరగతుల అభ్యున్నతే కెసిఆర్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

వైరా : కుల, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున వెనకబడి తరగతుల అభ్యున్నతే సిఎం కెసిఆర్ ధ్యేయమని వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ పివి.గౌతమ్ అన్నారు. శుక్రవారం వైరాలోని ఎన్‌విఎస్ గార్డెన్‌లో లబ్ధిదారులకు లక్ష రూపాయల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల, చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ తమ పేర్లను ఆన్‌లైన్ చేసుకుం ప్రభుత్వం వారికి లక్ష రూపాయలు అందించటం జరుగుతుందన్నారు. జూన్ 20వ తేదిలోగా దరఖాస్తు చేసుకొవాలని సూచించారు.

లబ్ధిదారులు కుల, ఆధాయ ధృవపత్రాలను సమర్పించాలని, ధృవపత్రాలు లేని వారు ఈ నెల 12న స్పెషల్ క్యాంపు ఏర్పాటు చేస్తామని అన్నారు. అంతేకాకుండా ఇల్లులేని ప్రతి పేద కుటుంబానికి ఇంటి స్థలం పంపిణీ చేస్తామన్నారు. గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్ల, కురుమలకు రానున్న మూడు నెలల్లో గొర్రెలను పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్నేహలత, మండల స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, బిఢే వెల్ఫేర్ అధికారి జ్యోతి, తహసీల్దార్ ఆరుణ, మున్సిపల్ కమిషనర్ వెంకశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News