Monday, January 20, 2025

పల్లెల అభివృద్ధే లక్షంగా కెసిఆర్ పాలన

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: పల్లెల అభివృద్ధే లక్షంగా కెసిఆర్ పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. తిరుమలగిరి(సాగర్) మండలంలోని రాజవరం గ్రామంలో సిడిపి ఎంఎల్‌సి నిధులు ద్వారా రూ. 10 లక్షల వ్యయ ంతో ని ర్మించే రోడ్డు పనుల శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీని గ్రామస్తులు, మహిళలు నృత్యాలతో స్వాగతం పలికారు. అన ంతరం ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడు తూ పల్లెల అభివృద్ధే లక్షంగా కెసిఆర్ పాలన సాగుతుందని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం అధికంగా నిధులు ఇస్తుందని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయ ంతో నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థా నిక సర్పంచ్ పోలేపల్లి సైదమ్మ ఆంజనేయులు, వైస్ ఎంపిపి ఎడవెల్లి దిలీప్‌రెడ్డి, రాష్ట్ర బిఆర్‌ఎస్ నాయకులు మన్నెం రంజిత్‌యాదవ్, గరికనేటితండా సర్పంచ్ భిక్షానాయక్, నేతాపురం సర్పంచ్ కుమారి వెం కట్‌రెడ్డి, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News