Monday, December 23, 2024

అంబేద్కర్ స్ఫూర్తితో కెసిఆర్ పాలన

- Advertisement -
- Advertisement -

మాక్లూర్: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణరాష్ట్రంలో సిఎం కెసిఆర్ పాలన సాగుతోందని పియుసి ఛైర్మన్, ఆర్మూర్ ఎంఎల్‌ఏ, బిఆర్‌ఎస్ నిజామాబాద్‌జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం మాక్లూర్ మండలం మానిక్‌బండార్ గ్రామ శివారులో మాక్లూర్ మండల మాల కమిటీ కళ్యాణ మండప నిర్మాణానికి బుధవారం ఆయన భూమి పూజ చేశారు. దళిత సంక్షేమానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలుచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాస్త ప్రభాకర్, టిఎన్‌జిఓ అధ్యక్షుడు అలుక కిషన్, మాక్లూర్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు బడుగు సత్యనారాయణ, మాల సంఘ మాక్లూర్ అధ్యక్షుడు ఎల్లన్న, పిఎసిఎస్ ఛైర్మన్ శ్రీనివాస్‌గౌడ్, రంజిత్, సర్పంచులు, సీనియర్ నాయకులు రజనీష్, వినయ్‌కుమార్ , కృష్ణ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News