Monday, December 23, 2024

కెసిఆర్ పాలనకు స్వస్తి పలకాలి

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : తెలంగాణ రాష్ట్ర ప్రజల అండదండలతో అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కెసిఆర్ అమూల్యమైన రాష్ట్ర సంపదను కుటుంబీకులు అనుచర వర్గాలకు దోచిపెడుతున్నారని కెసిఆర్ పాలనకు స్వస్తి పలకకపోతే రాష్ట్రానికిముప్పు తప్పదని ముథోల్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. లోకేశ్వరం మండలంలోని రాయపూర్ రాజురా గ్రామాలలో శనివారం పల్లె పల్లెకు బిజెపి గడపగపడకు మోహన్ రావు మహజ సంపర్క్ అభియాన్ కార్యక్రమాలను బోస్లే మోహన్ రావు పటేల్ మండల బిజెపి నాయకులతో కలిసి పర్యటించారు.

గ్రామాలలోని పార్టీ జెండాలను ఎగురవేసి మోడీ ప్రభుత్వం గ్రామాలకు అందిస్తున్న నిధులు సంక్షేమ పథకాలున్న క్యాలెండర్‌ను ఇంటింటా అందించి అవగాహన కల్పించారు. అనంతరం నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యమ సాధనలో అమరులైన ఉద్యమంలో కీలకపాత్ర వహించిన వారికి కెసిఆర్ ఏ మాత్రం ప్రాముఖ్యత ఇవ్వడం లేదని నిన్న మొన్న ఇతర పార్టీలు మారిన వారికి పదవులు కట్టబెడుతున్నారని మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు పక్కదారి పట్టించి రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తూ కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం లేదని అమాయక ప్రజలను మభ్య పెడుతున్నారని ఆరోపించారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించి దేశానికి అన్నం పెట్టే రైతుకు బ్రతికి ఉన్నప్పుడు రుణమాపీ అందించని ప్రభుత్వం చచ్చిన తర్వాత రైతుబీమా ఇవ్వడం దండగని అన్నారు.

ఒకపక్క రైతులకు పెట్టుబడి సాయం అంటూ రైతుబంధు ఇస్తూనే మరో పక్క ధాన్యం తూకంలో క్వింటాళుకు 12=15 కిలోల ధాన్యాన్ని తరుగు రూపంలో తగ్గించి మోసగిస్తున్నారని రైతుల ఉసురు ఊరికే పోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతుల్ని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని రాబోయే ఎన్నికలలో అత్యధిక స్తానాలలో బాజపా అఖండ విజయం సాధించడం ఖాయమని గెలుపుదీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిజెపి నాయకులు కార్యకర్తలు, యువకులు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News