Saturday, November 23, 2024

కెసిఆర్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేమిలేదు

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అమూల్యమైన రాష్ట్ర సంపదను దోచుకోవడమే తప్ప రాష్ట్రానికి చేసిందేమి లేదని ముథోల్ నియోజకవర్గ బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బోస్లే మోహన్ రావు పటేల్ అన్నారు. మండలంలోని రాయపూర్ కాండ్లి, అర్లి గొడిసెరా గ్రామాలలో శుక్రవారం పల్లె పల్లెకు బిజెపి గడపగడపకూ మోహన్ రావు మహాజన సంపర్క్ అభియాన్ కార్య క్రమాలను బోస్లే మోహన్ రావు పటేల్ మండల బిజెపి నాయకులతో కలిసి నిర్వహించారు.

ముందుగా గ్రామాలలోని పార్టీ జెండాలను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన రచ్చబండలో ఆయన మాట్లా డుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగు తుందని తెలంగాణ ప్రజల ఏకపక్ష నిర్ణయంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకై ఉద్యమానికి ఊపిరిపోసి అన్ని వర్గాల ఉద్యోగులు, కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు, ఆయా పార్టీలు సకల జనుల సమ్మెలో పాల్గొని వందలాది మంది ఆత్మబలిదానాల ఫలితంగా రాష్ట్రాన్ని ఏ ర్పాటు చేసుకున్న సరైన నాయకున్ని ఎన్నుకోవడంలో మాత్రం క్ష మించరాని తప్పు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధ్ది చేసుకోలేకపోతున్నామని కెసిఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాజెక్టులు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ, కార్యక్రమాల పేర్లతో కుటుంబీకులు అనుచర వర్గాల వారికి కాంట్రాక్టర్లను ఇచ్చి రాష్ట్రంపై వేల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు.

ఇప్పటికే తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం చేసిన ముఖ్యంమంత్రి కెసిఆర్ అధికార దాహంతో మళ్లీ రా నున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మొన్నటి వరకు దళితులను దళిత బంధు అని ఏమార్చి ఇప్పుడు బిసి కుల వృత్తుల వారికి ఒక లక్ష రూ పాయలు బ్యాంకు రుణాలని మభ్య పెడుతున్నాడని ప్రజలు ఇకనైనా మే ల్కొని సుస్థిర పాలనందించే బాజాపా పార్టీకి ఓటేసి పట్టం కట్టాలని తెలి యజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News