Monday, November 18, 2024

కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాల మూసివేత

- Advertisement -
- Advertisement -

Kedarnath and Yamunotri shrines to close for winter

డెహ్రాడూన్: శీతాకాలం ప్రారంభాన్ని పురస్కరించుకుని కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను శనివారం నుంచి మూసివేశారు. పూజారులు వేద మంత్రాలను పఠిస్తుండగా ఆలయ సాంప్రదాయాల ప్రకారం శనివారం ఉదయం 8 గంటలకు కేదార్‌నాథ్ ఆలయ ద్వారాలు, మధ్యాహ్నం 12.15 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను మూసివేసినట్లు చార్‌ధామ్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ రెండు ఆలయాల పోర్టల్స్‌ను మూసివేసినట్లు బోర్డు మీడియా విభాగం తెలిపింది. హిమాలయ పర్వతాలలో ఉన్న ఈ రెండు ఆలయాలను మంచు దట్టంగా కురిసే శీతాకాలంలో మూసివేయడం సాంప్రదాయంగా వస్తోంది.

ఈ కార్యక్రమాన్ని తలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు ఈ రెండు ఆలయాలను సందర్శించారు. ఆలయాల మూసివేత అనంతరం కేదార్‌నాథ్ ఆలయంలోని ప్రధాన మూర్తి బాబా కేదార్(మహాశివుడు) విగ్రహాన్ని ఉఖిమఠ్‌కు, యమున అమ్మవారి విగ్రహాన్ని ఖర్సాలికి పల్లకిలలో ఊరేగింపుగా తరలించారు. మార్గమధ్యంలో అనేక చోట్ల ఆగుతూ కొద్ది రోజులలో ఈ రెండు ఊరేగింపులు తమ శీతాకాలం విడిది క్షేత్రాలను చేరుకుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు నాలుగున్నర లక్షల మందికి పైగా భక్తులు పాల్గొన్నట్లు మీడియా సెల్ తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News