Friday, November 22, 2024

కేదార్‌నాథ్ ఆలయం తలుపులు మూసివేత

- Advertisement -
- Advertisement -

రుద్రప్రయాగ్ : ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయం తలుపులు బుధవారం ఉదయం 8.30 గంటలకు మూసివేశారు. అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమాన్ని సందర్శించడానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాదాపు 2500 మంది తెల్లవారు జామున చలిలో వచ్చి ఈ కార్యక్రమాన్ని సందర్శించారని కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ క్షేత్రం పూర్తిగా మంచుతో పేరుకుపోతోంది. తలుపులు మూసివేసిన తరువాత కేదార్‌నాథ్‌కు చెందిన పంచముఖీ దేవత విగ్రహాన్ని పూజార్లు భుజాలపై మోసుకుంటూ ఉఖీమఠ్ లోని ఓంకారేశ్వరాలయానికి ఊరేగింపుగా తీసుకు వచ్చారు. అక్కడ ఈ శీతాకాలమంతా పూజలు జరుగుతాయి. ఈ క్షేత్రాన్ని ఇంతవరకు 19.5 లక్షల మంది భక్తులు సందర్శించారని అజయ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News