కేదార్‌నాథ్ (ఉత్తరాఖండ్): శీతాకాలం విరామం తరువాత మంగళవారం కేదార్‌నాథ్ దేవాలయం ద్వారాల తలుపులు భక్తుల దర్శనం కోసం తెరుచుకున్నాయి. జీరో కన్నా అత్యంత తక్కువ స్థాయి ఉష్ణోగ్రతల్లో మంచు దట్టంగా పేరుకుపోయిన ఈ క్షేత్రానికి వెళ్లడానికి భక్తులు ఆసక్తి చూపించారు. ఆలయంలో వేదమంత్రాలు, శ్లోకాలు చదువుతూ పూజలు జరుగుతున్న సమయంలో ప్రధాన పూజారి రావల్ భీమ శంకర్ లింగా ద్వారాలు తెరిచారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధమి, ఆలయంలో పూజలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ తరఫున మొదటి పూజ తాను చేశానని చెప్పారు.
Also Read: గుజరాత్ హైకోర్టుకు రాహుల్..
తీవ్ర ప్రతికూల వాతావరణం కారణంగానే కేదార్‌నాధ్‌కు ప్రయాణం కావడం కొంచెం కష్టంగా ఉంటుందన్నారు. కొన్ని రోజుల్లో వాతావరణం అనుకూలంగా మారుతుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చిందని పేర్కొన్నారు. గత ఏడాది ప్రధాని మోడీ రోప్‌వే కు శంకుస్థాపన చేశారని, త్వరలో రోప్‌వే లింకు ఏర్పడుతుందన్నారు. బీజేపీ ఎమ్‌ఎల్‌ఎ శైలరాణి రావత్, బదిరీనాథ్‌కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఛైర్మన్ అజేంద్ర అజయ్ ముఖ్యమంత్రితో ఉన్నారు.