డెహ్రాడూన్: కేదార్‌నాథ్ ఆలయానికి మొక్కులు, విరాళాలు, భక్తులకు అందించిన వివిధ సేవల ద్వారా వచ్చిన ఆదాయం 2021 మార్చి నుంచి రెట్టింపయిందని సమాచార హక్కు కింద అడిగిన ఓ ప్రశ్న ద్వారా వెల్లడయింది. 2020-21లో రూ.22.04 కోట్లు ఉన్న ఆదాయం, 202324లో రూ.52.9 కోట్లకు చేరుకుందని శ్రీ బద్రీనాథ్‌కేదార్‌నాథ్ మందిర్ సమితి తెలిపింది.నోయిడాలోని ఆర్‌టిఐ కార్యకర్త అమిత్ గుప్తా సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు ప్రతిగా ఈ సమాచారం అందింది.
కేదార్‌నాథ్ మందిరం ఆదాయం 2.3 రెట్లు పెరిగిందని స్పష్టమయింది. కొవిడ్ తర్వాత భక్తుల రాక సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చిందని కూడా వెల్లడయింది. 202324లో ఇది రెట్టింపయిందని సమాచారం. కేదార్‌నాథ్ మందిరానికి భక్తులు మొక్కులు చెల్లించుకోవడం, విరాళాలు ఇవ్వడం, ప్రత్యేక దర్శనం ఫీజు, హెలికాప్టర్ల ద్వారా వచ్చే వారికి అదనపు ఫీజు తీసుకోవడం ద్వారా ఆదాయం వస్తోంది.