డెహ్రాడూన్: హిమాలయాలలో కొలువై ఉన్న కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భక్తుల సందర్శనార్థం మే 10వ తేదీ ఉదయం 7 గంటలకు తెరుచుకుంటాయని మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరింపకుని శుక్రవారం బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ(బికెటిసి) ప్రకటించింది. ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయ వద్ద బికెటిసి చైర్మన్ అజేంద్ర అజయ్ ఈ విషయం వెల్లడించారు. ఏటా లక్షలాది మంది భక్తులు సందర్శించే కేదార్‌నాథ్ ఆలయ పోర్టల్స్ శీతాకాలం మూతపడతాయి.
గత ఏడాది యాత్రా కాలంలో రికార్డు స్థాయిలో కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించారని, ఈ ఏడాది కూడా ఈ సంఖ్య మరింత పెరగనున్నదని ఆయన చెప్పారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో ప్రభుత్వం, ఆలయ కమిటీ భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాయని అజయ్ తెలిపారు. త్వరలోనే ఆలయ కమిటీ బృందం కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సమీక్షిస్తుందని ఆయన చెప్పారు. ఓంకారేశ్వర్ ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాలలో ఫ్రాంటియర్ డెవలప్‌మెంట్ కమిటీ అధ్యక్షుడు చండీ ప్రసాద్ భట్ పచ్‌గై, కేదార్‌నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడు ధామ్ రావల్ భీమశంకర్ లింగ్ పాల్గొన్నారు.