Monday, December 23, 2024

ఏప్రిల్ 25న తెరుచుకోనున్న కేదార్‌నాథ్ ఆలయం

- Advertisement -
- Advertisement -

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఎగువ గర్వాల్ హిమాలయాల్లోఉన్న సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్ ఆలయం భకుల్త కోసం ఏప్రిల్ 25న తెరుచుకోనుంది. ప్రతి ఏటా శీతాకాలంలో ఆరు నెలల పాటు ఈ ఆలయాన్ని మూసి ఉంచుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ ఉదయం 6.20 గంటలకు భక్తుల కోసం ఆలయం తలుపులను తెరుస్తారని బద్రీనాథ్‌కేదార్‌నాథ్ మందిర్ సమితి వర్గాలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం ఉక్తిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేదారేశ్వర ఆలయాన్ని తిరిగి తెరిచే తేదీ, సమయాన్ని ఖరారు చేశారు.

ఈ కార్యక్రమానికి బద్రీనాథ్‌కేదార్‌నాథ్ మందిర్ సమితి అధికారులు, తీర్థ్ పురోహితులు, జిల్లా పాలనా యంత్రాంగానికి చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రతి ఏడాది కేదార్‌నాథ్ ఆలయాన్ని మూసివేసిన తర్వాత ఆలయంలోని విగ్రహాలను ఉక్తిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి తీసుకు వచ్చి, శీతాకాలంలో అక్కడ పూజలు నిర్వహిస్తారు. కాగా చార్‌ధామ్ ఆలయాల్లో భాగమైన బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలను ఇప్పటికే ఏప్రిల్ 27, 22 తేదీల్లో తెరవనున్న విషయం తెలిసిందే. కేదార్‌నాథ్ ఆలయంతో పాటుగా ఈ ఆలయాలను కూడా శీతాకాలంలో తీవ్రమైన చలి కారణంగా ప్రతి ఏడాది అక్టోబర్‌నవంబర్ నెలల్లో మూసివేసి తిరిగి ఆరు నెలల తర్వాత తెరుస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News