Sunday, January 19, 2025

తరుణ్ భాస్కర్ సినీ ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం

- Advertisement -
- Advertisement -

యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ’కీడా కోలా’తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. కీడా కోలా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో నిర్వహించింది. హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్‌లో హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘తరుణ్ నమ్మింది, నచ్చిన స్క్రిప్ట్, నచ్చిన వాళ్ళతో చేసే దర్శకుడు. ‘పెళ్లి చూపులు’తో నాకు లాంచ్ ఇచ్చాడు. తర్వాత ఇంకొంత మంది కొత్త వాళ్లతో ‘ఈ నగరానికి ఏమైంది’ చేసి ఇంకొంతమందికి కెరీర్ ఇచ్చాడు. ఇప్పుడు ‘కీడా కోలా’లో కూడా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ కనిపిస్తున్నారు. తరుణ్‌కి తనపై, తన కథలపై నమ్మకం ఎక్కువ. ఈ విషయంలో అతన్ని గౌరవిస్తాను. తరుణ్ ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం. ‘కీడా కోలా’ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది’ అని అన్నారు.

తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ‘క్రైమ్ కామెడీ నా ఫేవరేట్ జోనర్. ఈ సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఫీలౌతున్నాను. ఈ సినిమా మా గురించి కాదు ప్రేక్షకుల గురించి డిజైన్ చేశాం. ఎన్ని సమస్యలున్నా నవ్వు కలిగించాలనే ప్రయత్నమే ఈ సినిమా. నవంబర్ అంతా నవ్వుకోవచ్చు. ఇందులో బ్రహ్మానందం నటించడం మా అదృష్టం. ఈ సినిమా చూస్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు నవ్వుతారు. అని తెలిపారు.

బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నన్ను వీల్ చెయిర్‌లో కూర్చోబెట్టి కామెడీ చేయాలనే కొత్త ఆలోచన తరుణ్ భాస్కర్‌కి వచ్చింది. చాలా భాద్యతగా సినిమా తీసే దర్శకుడు తరుణ్. జంధ్యాల సినిమాలు చేస్తున్నపుడు కామెడీ ఎంత హాయిగా పడిందో మళ్ళీ ఈ సినిమాకి అలాంటి అనుభూతి కలిగింది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాగ్ మయూర్, చైతన్య రావు, నిర్మాత సాయికృష్ణ, నిర్మాత శ్రీపాద్, రాజా గౌతమ్, వివేక్ సాగర్, రఘురాం, ఆశిష్ తేజ్, పూజిత, ఆరోన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: ‘హాయ్ నాన్న’ మూడో సింగిల్ వచ్చేస్తోంది..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News