Sunday, December 22, 2024

నవంబర్ 3న ‘కీడా కోలా’

- Advertisement -
- Advertisement -

యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన పెళ్లిచూపులు, ఈ నగరానికి ఏమైంది.. రెండూ పెద్ద విజయాలు సాధించాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సినిమాలను తీయడంలో దిట్ట అనిపించుకున్న తరుణ్ భాస్కర్ ఈసారి సరికొత్త క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.  హీరో రానా దగ్గుబాటి ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.

‘కీడా కోలా’ ఇప్పటికే ఫస్ట్ లుక్స్, టీజర్ తో క్యురియాసిటీని పెంచింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. నవంబర్ 3న ‘కీడా కోలా’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, చైతన్య రావు.. ప్రధాన తారాగణం అంతా సీరియస్ లుక్స్ లో కనిపించడం ఆసక్తికరంగా వుంది.

కీడా కోలా విజి సైన్మా మొదటి ప్రొడక్షన్. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఏజే ఆరోన్ డీవోపీగా, ఉపేంద్ర వర్మ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News