Saturday, November 23, 2024

స్వఛ్చత పక్వాడాలో ఏరియాను ముందు వరుసలో నిలుపండి

- Advertisement -
- Advertisement -

యైటింక్లయిన్‌కాలనీ: పక్షం రోజుల పాటు నిర్వహించే స్వఛ్చతా పక్వాడా కార్యక్రమంలో ఆర్‌జి2 ఏరియాను ముందు వరుసలో నిలు పాలని జిఎం అయిత మనోహర్ కోరారు. కేంద్ర ప్రభుత్వ కోల్ మినిస్ట్రీ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వరంగ సంస్థల్లో జూన్ 16 నుంచి 30 వరకు ఏరియాలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఇందులో భాగంగా ఆర్‌జి2 ఏరియాలో శుక్రవారం ప్రతిజ్ఙ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన జిఎం మాట్లాడుతూ పక్షం రోజుల పాటు స్వఛ్చతపై అవగాహన, గనులు, డిపార్ట్‌మెంట్స్, పాఠశా లలు, కార్యాలయాలు, కాలనీలు, డిస్పెన్సరీలను పరిశుభ్రంగా ఉంచడం, వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

అలాగే ప్లాస్టిక్ వాడకంపై అవగాహన, హరితహరంలో భాగంగా మొక్కలు విరివిగా మొక్కలు నాటడం జరుగుతుందన్నారు. ఇట్టి కార్యక్రమాలను దిగ్విజయం చేసి ఏరియాను ముందు వరుసలో ఉంచాలన్నారు. కార్యక్రమంలో టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు ఐలి శ్రీనివాస్, అధికార ప్రతినిధి జి రాజేంద్రప్రసాద్, ఐఇడి మురళీకృష్ణ, సెక్యూరిటి అధికారి పివి రమణ, ఎస్టేట్స్ అధికారి జె సునీత, పర్యావరణాధికారి సురేష్‌బాబు, పిఎం ఎస్ అనిల్‌కుమార్, ఇఇ సివిల్ వినయ్‌సాగర్, డివైపిఎం వంశీధర్, పర్సనల్ అధికారి మండల శ్రీనివాస్, పిట్ సెక్రటరీ చిప్ప సత్యనారాయణ, ఆఫీసు సిబ్బంది పాల్గోన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News