Saturday, December 21, 2024

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని 40వ డివిజన్ కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. మంగళవారం 40వ డివిజన్‌లోని నానామియా తోటలో మహానగర పాలక సంస్థ మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రై డే నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. వర్షకాలంలో నీరు నిల్వ ఉన్న చోట్ల దోమలు మనకు హాని తలపెడుతాయని దీంతో రోగాలు సంక్రమించి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. బయాలజిస్ట్ మాధవరెడ్డి మాట్లాడుతూ.. వర్షకాలంలో ప్రతీ మంగళ, శుక్రవారాల్లో మలేరియా విభాగం ఆధ్వర్యంలో డ్రై డే నిర్వహించడం జరుగుతుందని కాలనీవాసులందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో మహానగర పాలక సంస్థ సూపర్‌వైజర్ మాదాసు సాంబయ్య, హెల్త్ ఇన్‌స్పెక్టర్ మధూకర్, అసిస్టెంటు శివకుమార్, జవాన్లు సతీష్, దయాకర్, ప్రశాంత్‌లతోపాటు బాబు, కిరణ్ చంద్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News