Saturday, November 16, 2024

జయహే..జయహే తెలంగాణకు తుది మెరుగులు

- Advertisement -
- Advertisement -

బాణీలను సమకూర్చి ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డికి వినిపించిన సంగీత
దర్శకుడు కీరవాణి రాష్ట్రావతరణ
దినోత్సవాన అధికారికంగా
అమల్లోకి ప్రముఖ కవి అందెశ్రీ గీతం

సిఎం రేవంత్‌రెడ్డితో కీరవాణి, ప్రజాకవి అందెశ్రీలు భేటీ
మనతెలంగాణ/హైదరాబాద్: సిఎం రేవంత్‌రెడ్డితో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, ప్రజాకవి అందెశ్రీలు భేటీ అయ్యారు. జూన్ 02వ తేదీన జరుగనున్న రాష్ట్ర అవతరణ వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర అధికార గీతంగా ‘జయ జయహే తెలంగాణ’ పాటను అమల్లోకి తీసుకురానుండగా దానికి సంబంధించిన పాటను కీరవాణి సిఎం రేవంత్‌రెడ్డి ఎదుట పాడి వినిపించారు.

5 రోజుల క్రితం సిఎం రేవంత్ వీరిద్దరు భేటీ అయిన సందర్భంగా ‘జయ జయహే తెలంగాణ’ గీతానికి సంబంధించి తుది మెరుగులు దిద్దాలని సిఎం వారికి సూచించగా దానికి తగ్గట్టుగా వారు ఆ గీతానికి తగ్గట్టుగా బాణీలను సమకూర్చి ఆ పాటకు తుది మెరుగులు దిద్దారు. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ముఖ్యమంత్రి సిపిఆర్‌ఓ అయోధ్యరెడ్డి తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News