Thursday, January 23, 2025

కళావతి పాత్ర చేయడం నా అదృష్టం

- Advertisement -
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’ను మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు పరశురాం అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దిన ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో హీరోయిన్ కీర్తి సురేష్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…

నా అదృష్టం…

ఈ సినిమాలో చేసిన పాత్రను ఇంతకుముందు చేయలేదు. దర్శకుడు పరశురాం సినిమాలో హీరోయిన్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ‘సర్కారు వారి పాట’లో కూడా కళావతి పాత్ర చాలా కీలకం. ఇంతపెద్ద కమర్షియల్ సినిమాలో అంతే ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కడం నా అదృష్టం. పరశురాం కథ విన్న వెంటనే ఈ సినిమాకు ఓకే చెప్పా.

ఎంజాయ్ చేస్తూ చేశాం…

మహేష్ బాబు టైమింగ్ మామూలుగా ఉండదు. సెట్‌లో చాలా సైలెంట్‌గా పంచులు పేలిపోతుంటాయి. మొదట సీరియస్ అనుకుంటాం కానీ తర్వాత తెలుస్తుంది… ఆయన సరదాగా ఆటపట్టిస్తున్నారని. ‘సర్కారు పాట షూటింగ్’ చాలా సరదాగా జరిగింది. చివరిలో షూట్ చేసిన పాట కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం.

చాలా ఆనందంగా ఉంది…

నా కెరీర్‌లో ఒక సాంగ్ ఇంత పెద్ద హిట్ కావడం ఈ సినిమాలోని ‘కళావతి’ పాటతోనే జరిగింది. 150 మిలియన్ వ్యూస్ క్రాస్ చేయడం అంటే మాటలు కాదు. నా పాత్ర పేరుతో ఇంత పాపులారిటీ రావడం చాలా ఆనందంగా వుంది. తమన్ అద్భుతమైన ఆల్బమ్ ఇచ్చారు. ప్రతి పాట సూపర్ హిట్ అయింది. అలాగే సినిమాలోని చివరి సాంగ్ వండర్‌ఫుల్‌గా వుంటుంది.

షాకింగ్ సంఘటన…

ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక షాకింగ్ సంఘటన జరిగింది. బార్సిలోనాలో ‘కళావతి’ పాట షూట్ చేస్తున్నాం. వ్యాన్‌లో నాలుగు బాక్సుల కాస్ట్యూమ్స్ పెట్టాం. షాట్ గ్యాప్‌లో మూడు బాక్సులు ఎవరో కొట్టేశారు. మిగిలిన ఒక్క బ్యాగ్‌లో లక్కీగా కంటిన్యూటీ కాస్ట్యూమ్ వుంది. చాలా టెన్షన్ పడ్డాం. అయితే టీమ్ అప్పటికప్పుడు మళ్ళీ కాస్ట్యూమ్స్ ఏర్పాటు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News