Saturday, December 21, 2024

నా స్టైల్ నాదే….

- Advertisement -
- Advertisement -

Keerthi Suresh

టాలీవుడ్‌లోకి ‘నేను శైలజ’తో ఎంట్రీ ఇచ్చి కీర్తి సురేష్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ్ ,మలయాళ భాషల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకున్న ఈ భామ గ్లామర్ రోల్స్ చేసినా ఎన్నడూ హద్దులు దాటి అందాలు ఆరబోయలేదు. కేవలం నటనతోనే పేరు ప్రఖ్యాతలు సంపాదించికుని సౌత్‌లో స్టార్ హీరోయిన్‌గా ముద్ర వేయించుకుంది. ఇక ‘మహానటి’ మూవీతో కీర్తి సురేష్ క్రేజ్ డబుల్ కాదు ట్రిపుల్ అయింది.

జాతీయ ఉత్తమ నటిగా అవార్డు సైతం అందుకుంది. అయితే ‘మహానటి’ అనంతరం కీర్తి సురేష్ కు గడ్డు కాలం నడిచింది. ఈమె చేసిన చిత్రాలన్నీ వరసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. కెరీర్ బాగా డల్ అవుతున్న తరుణంలో మహేష్ బాబుకు జోడీగా ‘సర్కారు వారి పాట’చేసి సక్సెస్ ట్రాక్ ఎక్కింది. ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమాల ఎంపికలో మునుపటి వేగం కనిపించడం లేదు. సినిమాలను అంత త్వరగా ఒప్పుకోవడం లేదు. ఆచి తూచి అడుగులు వేస్తోంది. కథలో తన పాత్ర ప్రాధాన్యత ఇలా అన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకుని..

సినిమా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం వచ్చాకే ఏదైనా కొత్త ప్రాజెక్ట్ కు ఆమె సైన్ చేస్తోందట. అయితే ఈ క్రమంలోనే కీర్తి సురేష్ మిగిలిన హీరోయిన్లతో పోటీ పడలేకపోతోందని ఆమె జోరు తగ్గిపోయిందంటూ గత కొద్ది రోజుల నుండీ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కీర్తి సురేష్ స్పందిస్తూ “వేగంగా సినిమాలు చేసేయాలన్న ఆతృత నాకు లేదు. ఎప్పుడు మంచి కథ వస్తే.. అప్పుడే సైన్ చేస్తాను. పది సినిమాలు వరుసగా చేయడం కంటే కాస్త ఆలోచించి.. ఓ మంచి సినిమా చేస్తే జనం ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకుంటారు. మిగిలిన హీరోయిన్లు వేగంగా సినిమాలు చేస్తున్నారు. అది నిజమే. కానీ ఈ విషయంలో నేను వాళ్లతో పోటీ పడాలనుకోవడం లేదు. సినిమాలను ఒప్పుకోవడంలో నా స్టైల్ నాదే” అని పేర్కొంది. కాగా కీర్తి సురేష్ తెలుగులో నానికి జోడీగా ‘దసరా’ అనే మూవీ చేస్తోంది. చిరంజీవికి సోదరిగా ‘భోళా శంకర్’లో నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News