Monday, December 23, 2024

అందుకే గ్లామర్ పాత్రలు చేయడం లేదు

- Advertisement -
- Advertisement -

Keerthi suresh aren't doing Glamour character
సినీ ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు గ్లామర్ పాత్రలను ఎంచుకుని ఓ రేంజ్‌లో అందాలు ఆరబోస్తుంటే.. కొందరు ముద్దుగుమ్మలు మాత్రం నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్స్‌ని ఎంపిక చేసుకుంటూ స్టార్స్ గా ఎదుగుతున్నారు. ఈ రెండో రకానికి చెందిన హీరోయిన్ల జాబితాలో కీర్తి సురేష్ ఒకరు. 2013లో వచ్చిన ‘గీతాంజలి’ అనే మలయాళ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేను శైలజ’తో తొలిసారి తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ గుర్తింపు పొందిన ఆమె.. ‘మహానటి’తో స్టార్ స్టేటస్‌ను అందుకుంది. దీంతో సాధారణ ప్రేక్షకులు అభిమానులే కాదు విమర్శకులు సైతం కీర్తి సురేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు.

అయితే ఈ అందాల భామ ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలమే అయినా.. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలను చేసింది లేదు. ఏ సినిమాలోనూ హద్దులు మీరి అందాలు ఆరబోసిందీ లేదు. కేవలం నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. అయితే గ్లామర్ పాత్రలు చేయకపోవడానికి కారణం ఏంటో కీర్తి సురేష్ చెప్పేసింది. “నటిగా నా అభినయం ప్రేక్షకులు ఇష్టపడాలని ఎప్పుడూ కోరుకుంటాను. అదృష్టవశాత్తు నటనకు ఆస్కారమున్న పాత్రలే నన్ను వెతుక్కుంటూ వస్తున్నాయి. వాటితోనే ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాను. గ్లామర్ పాత్రలు నా మొదటి ప్రాధాన్యం కానేకాదు. అయినా తెరపై ఎలా కనిపించాలి అనే విషయంలో నాకు కొన్ని హద్దులు ఉన్నాయి.

వాటిని చెరపలేను. ఆ కారణంగానే గ్లామర్ పాత్రలను చేయడం లేదు” అని కీర్తి సురేష్ పేర్కొంది. కాగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కీర్తి కలిసి నటించిన ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే మలయాళంలో ఆమె చేసిన ‘చిన్ని’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో మే 6న రిలీజ్ కాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News