పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు పసుపు తాడుతో కనిపించింది కీర్తి సురేష్. పెళ్లయిన తర్వాత హీరోయిన్లంతా మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చేస్తారు. కానీ కీర్తిసురేష్ మొత్తం మెడలో పసుపు తాడుతోనే తన సినిమా ప్రచారానికి వచ్చింది. దీని వెనక స్టోరీని ఆమె బయటపెట్టింది. “మా సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు పసుపు తాడుతో చేసిన మంగళసూత్రాన్ని మెడలో ధరించాల్సి ఉంటుంది.
ఆ తర్వాత ఓ మంచి రోజు చూసి పసుపు తాడు స్థానంలో బంగారం చైన్ పెట్టుకోవచ్చు. నా పెళ్లి తర్వాత బంగారం గొలుసు ధరించడానికి మంచి రోజులు రాలేదు. అందుకే పసుపు తాడుతోనే ప్రచారానికి వచ్చాను. నిజానికి మా కుటంబంలో కొందరు కావాలంటే తాడు తీసేసి, గొలుసు వేసుకోవచ్చన్నారు. కానీ సంప్రదాయం పాటించాలని నాకే అనిపించింది”అని కీర్తిసురేష్ చెప్పింది.
ఇక 15 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నప్పటికీ కీర్తిసురేష్-, ఆంటోనీ ప్రేమ విషయం బయటకు రాలేదు. దీనికి కూడా కారణం వెల్లడించింది. “మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ కోలీవుడ్‌లో లేరు. అందుకే మా ప్రేమ విషయం రహస్యంగా ఉంది. ఇక పెళ్లి విషయానికొస్తే, 2022 ఏప్రిల్ నుంచే పెళ్లి గురించి మేం మాట్లాడుకుంటూ వచ్చాం”అని కీర్తి వెల్లడించింది.