Sunday, January 12, 2025

12న గోవాలో పెళ్లి

- Advertisement -
- Advertisement -

మహానటి ఫేం కీర్తి సురేష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే ఆమె పెళ్లికి చేసుకోబోతుండడం విశేషం. తాజాగా కీర్తి సురేష్ స్వయంగా తన పెళ్లి గురించి చెప్పింది. ఇటీవల తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వెళ్లిన సమయంలో మీడియా వారితో మాట్లాడుతూ పెళ్లి విషయమై అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది.

డిసెంబర్‌లో తన వివాహం గోవాలో జరగబోతుందని అధికారికంగా ప్రకటించింది. గోవాలో పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. కీర్తి సురేష్ హిందువు కాగా, ఆమె పెళ్లి చేసుకోబోతున్న ఆంటోనీ క్రిస్టియన్ కావడంతో రెండు మతాల పద్దతుల్లో వివాహం జరగబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె కుటుంబ సభ్యులు తెలియజేశారు. కీర్తి సురేష్ వివాహం మొదట రిసార్ట్‌లో హిందూ సాంప్రదాయాల ప్రకారం జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్ 12న ఉదయం కీర్తి సురేష్ మెడలో ఆంటోనీ తాళి కట్టబోతున్నాడు. అదే రోజు సాయంత్రం సమయంలో గోవాలోని ప్రముఖ చర్చిలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకోబోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News