హీరోయిన్ కీర్తి సురేష్ ఎలాంటి పరిస్థితుల్లో పెళ్లి చేసుకుందో అందరికీ తెలిసిందే. ఓవైపు ఆమె నటించిన తొలి హిందీ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఆ సినిమాకు ప్రచారం చేయాల్సిన సమయంలో పెళ్లి పెట్టుకుంది. దీంతో ఆమె పెళ్లి వేడుకకు చాలా కొద్దిరోజులు మాత్రమే సమయం కేటాయించాల్సి వచ్చింది. పెళ్లి తంతు ముగిసిన వెంటనే పసుపు తాడుతోనే ప్రమోషన్స్‌కు హాజరైంది. అలా తన పెళ్లిని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోయిన కీర్తిసురేష్, ఆ పని ఇప్పుడు చేస్తోంది. వరుసగా తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోల్ని షేర్ చేస్తూ.. పెళ్లి రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటోంది. గత ఏడాది డిసెంబర్ 12న గోవాలో కీర్తిసురేష్ పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ది సెయింట్ రెగిస్ రిసార్ట్‌లో తమిళ బ్రాహ్మణ, మలయాళీ క్రిస్టియన్ సంప్రదాయాల్లో పెళ్లిని జరిపించారు. ఆ ఫొటోలనే తాజాగా విడుదల చేసింది కీర్తిసురేష్. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి.
మధుర జ్ఞాపకాలు
- Advertisement -
- Advertisement -
- Advertisement -