Tuesday, January 7, 2025

వరుస హిట్స్‌తో దూసుకుపోతూ…

- Advertisement -
- Advertisement -

స్టార్ బ్యూటీ కీర్తి సురేష్ టాలీవుడ్‌లో ప్రస్తుతం వరుసగా హిట్స్ అందుకుంటోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నటించిన ‘సర్కార్ వారి పాట’ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం ఈ భామకి ‘దసరా’ పెద్ద ఆనందాన్ని తెచ్చిపెట్టింది. నాని కెరీర్ లో మొదటి 100 కోట్ల గ్రాస్ మూవీగా నిలిచింది ‘దసరా’. అలా ఒక మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకొంది కీర్తి. అంతే కాదు ఈ సినిమాలో పెళ్లి బారాత్ డ్యాన్స్ చేసి అదరగొట్టింది. డ్యాన్స్ విషయంలో కూడా ఆమెకి మంచి మార్కులు పడ్డాయి. ఆ విధంగా ‘దసరా’ ఆమెకి అన్నివిధాలా మంచి క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. నానితో నటించిన రెండు సినిమాలు హిట్ కావడం కూడా విశేషం. వీరిది హిట్ పెయిర్ అన్న ముద్ర పడింది. కీర్తి సురేష్ మరో తెలుగు చిత్రం ఇంకా ఒప్పుకోలేదు. కానీ ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా ‘భోళాశంకర్’లో నటిస్తోంది. ఆమె తదుపరి విడుదల ఇదే. ఇక మంచి నటిగా ‘మహానటి’ చిత్రంతో కీర్తి సురేష్ ఎప్పుడో జాతీయ అవార్డు అందుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News