Monday, December 23, 2024

మళ్లీ వాటినే చేస్తా

- Advertisement -
- Advertisement -

Keerthi Suresh said about Lady Oriented movies

 

కీర్తి సురేష్.. ఈ మలయాళ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. చైల్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ’గీతాంజలి’ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో వచ్చిన ‘నేను శైలజ’తో టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది కీర్తి సురేష్. తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన ఆమె ’మహానటి’ మూవీతో మంచి పాపులారిటీని సంపాదించుకుంది. ఈ చిత్రంలో అలనాటి నటి సావిత్రిగా అద్భుతమైన నటనను కనబరిచి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ మూవీ అనంతరం కీర్తి సురేష్‌కు ఇక తిరుగుండదని అందరూ భావించారు. కానీ అందరి ఊహలకు భిన్నంగా ఆమె కెరీర్ క్రమంగా డౌన్ అయిపోయింది. అందుకు కారణం ఆమె వరసగా చేసిన లేడీ ఓరియెంటెడ్ చిత్రాలే. కథ, స్క్రీన్ ప్లే వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి వంటి చిత్రాలు చేసింది. అయితే ఈ చిత్రాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరచడమే కాదు.. కీర్తి సురేష్ ఇమేజ్‌ను సైతం దెబ్బ తీశాయి.

ఈ తరుణంలో ‘సర్కారు వారి పాట’ మూవీలో మహేశ్ బాబుకు జోడీగా నటించే అవకాశం వచ్చింది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇందులో కళావతిగా కీర్తి సురేష్ మైమరపించింది. ఈ మూవీతో కెరీర్ పరంగా మళ్లీ పుంజుకున్న కీర్తి సురేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “సర్కారు వారి పాట సినిమా తర్వాత తనకు మరిన్ని కమర్షియల్ చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ ముందుకెళ్లడమే నా కిష్టం. నాయిక ప్రాధాన్యం ఉన్న కథలు వస్తే తప్పకుండా నటిస్తాను”అని చెప్పింది. దీంతో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కలిసిరాకపోయినా.. మళ్లీ వాటినే చేస్తానని చెప్పడం ఎందుకని అభిమానులు కలవర పడుతున్నారు. కాగా కీర్తి సురేశ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె నాని సరసన ’దసరా’, మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా ’భోళా శంకర్’ చిత్రాలు చేస్తోంది. అలాగే తమిళ్, మలయాళ భాషల్లోనూ పలు సినిమాలకు కీర్తి సైన్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News