Wednesday, January 8, 2025

ఆకట్టుకుంటున్న కీర్తి సురేష్ ‘గాంధారి’ సాంగ్..

- Advertisement -
- Advertisement -

Keerthi Suresh's Gandhari Video Song Released

హైదరాబాద్: మహానటి కీర్తి సురేష్ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. ది రూట్, సోని మ్యూజిక్ సౌత్ సంయుక్తంగా నిర్మించిన ఓ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది. తాజాగా ఈ వీడియోను విడుదల చేశారు. ‘గాంధారీ గాంధారీ.. నీ మరిది గాంధారీ .. దొంగ చందమామలాగా వంగి చూసిండే’ అంటూ సాగే ఈ పాటలో మార్వాడీ డ్రెస్ ధరించి కీర్తి సురేష్ వేసిన మాస్ స్టెప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ లిరిక్స్ ఇవ్వగా, ‘లవ్ స్టోరీ’ ఫేం పవన్ సిహెచ్ సంగీతం అందించారు. బృంద మాస్టర్ కొరియోగ్రాఫీ అందించింది. కాగా, కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారింది.

Keerthi Suresh’s Gandhari Video Song Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News