Monday, January 20, 2025

బాలీవుడ్‌పై కీర్తి సురేష్ ఫోకస్..

- Advertisement -
- Advertisement -

అందాల తార కీర్తి సురేష్ మహానటి చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకొని జాతీయ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. ఆమె కెరీర్‌లో సర్కారు వారి పాట, దసరా సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధించాయి. ఈ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచి ఆమెకు హీరోయిన్‌గా భారీ క్రేజ్‌ను తీసుకువచ్చాయి. అయితే ఇప్పటి వరకు దక్షిణాదికి మాత్రమే పరిమితమైన కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్‌లో సినిమా చేస్తోంది. బేబీ జాన్ చిత్రంలో వరుణ్ ధావన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది.

బాలీవుడ్ ప్రేక్షకులకు తన నటనతో పాటు తన అందం కూడా పరిచయం చేయడానికి ఆమె చాలా ఉత్సాహంగా ఉంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టి బాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని కీర్తి సురేష్ తాపత్రయపడుతోంది. ఇక బేబీ జాన్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News