Wednesday, January 22, 2025

అది సూపర్‌గా కుదిరింది

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ ’భోళా శంకర్’. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తున్నారు. ‘భోళా శంకర్’ ఈనెల 11న విడుదల కానున్న నేపధ్యంలో హీరోయిన్ కీర్తి సురేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెప్పిన విశేషాలు…

రెండు పాటల్లో డ్యాన్స్…
భోళా శంకర్ మూవీలో నటించడంతో చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమాలో చిరంజీవితో డ్యాన్స్ చేసే అవకాశం కూడా దొరికింది. మెగాస్టార్‌తో ఒక్క ఫ్రేమ్ లోనైనా డ్యాన్స్ చేయాలని వుండేది. కానీ ఇందులో రెండు పాటల్లో డ్యాన్స్ చేసే అవకాశం దొరికింది.

సూపర్‌గా కుదిరింది…
చిరంజీవికి సిస్టర్ క్యారెక్టర్ అనగానే ముందు భయపడ్డాను. కానీ ఇందులో నా క్యారెక్టర్‌కి ఆ స్కోప్ వుంది. అన్నయ్యతో చాలా బబ్లీ, జాలీగా వుండే క్యారెక్టర్ కాబట్టి అది సూపర్‌గా కుదిరింది. ప్రధానంగా బ్రదర్, సిస్టర్ స్టొరీ ఇది. బ్రదర్, సిస్టర్ ఎమోషన్‌తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా పక్కా ప్యాకేజ్‌గా వుంటుంది.

బ్యూటీఫుల్ జర్నీ…
చిరంజీవి సెట్స్‌లో చాలా విలువైన సూచనలు ఇచ్చారు. ఇలా చేస్తే బావుంటుందని చెప్పేవారు. రోజు చిరంజీవి ఇంటి నుంచి భోజనం వచ్చేసేది. నాకు ఫలానాది కావాలని అడిగి మరీ తెప్పించుకునే దాన్ని. ఈ సినిమా నాకు బ్యూటీఫుల్ జర్నీ.

ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నారు…
తమన్నా ఇందులో కామెడీ బ్యూటీఫుల్‌గా చేశారు. డబ్బింగ్ చూసి చాలా ఎంజాయ్ చేశాను. తమన్నా, చిరంజీవి కాంబినేషన్ సీన్స్ చాలా బావుంటాయి. ఇప్పుడు తమన్నా ఫుల్ ట్రెండింగ్‌లో వున్నారు. తనకి జైలర్, భోళా శంకర్ రెండు రిలీజ్‌లు వున్నాయి.

ఆడియన్స్ పల్స్ తెలుసు…
మెహర్ ఈ కథ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఆయనకి కమర్షియల్ మీటర్ , ఆడియన్స్ పల్స్ బాగా తెలుసు. నిజానికి మెహర్‌ని అన్నయ్యలా భావిస్తున్నాను. ఈ సినిమాతో తనకో చెల్లి దొరికింది నాకో అన్నయ్య దొరికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News