Friday, December 20, 2024

స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకోనున్న కీర్తి సురేశ్

- Advertisement -
- Advertisement -

సోషల్ మీడియాలో ఊపందుకున్న పెళ్లి ప్రచారం
డిసెంబర్ 11న గోవాలో వివాహం?
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రముఖ కథానాయిక కీర్తి సురేశ్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందా? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. ’మహానటి’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ చిత్రం తరువాత తెలుగుతో పాటు పలు భాషల్లో హీరోయిన్‌గా బిజీ అయ్యారు. ’మహానటి’ చిత్రంతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డును పొందిన కీర్తి ప్రస్తుతం సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తున్నారు. అయితే ఆమె త్వరలో తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. దుబాయ్‌లో స్థిరపడిన కొచ్చికి చెందిన ఆంటోని తట్టిల్‌తో కీర్తిసురేశ్ ు్క పదిహేను సంవత్సరాల స్నేహబంధం ఉంది.

త్వరలో వీరి స్నేహబంధం పెళ్లితో భార్యాభర్తల అనుబంధంగా మారనుంది. ఇందుకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారట. డిసెంబర్ 11న వీరి వివాహం గోవాలో జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. అంతేకాదు ఇప్పటికే కీర్తి సురేశ్ టాలీవుడ్, కోలీవుడ్‌లో కొంత మంది హీరోలకు శుభలేఖలు కూడా ఇచ్చారని చెబుతున్నారు. అత్యంత ఆత్మీయులు, స్నేహితుల మధ్య సింపుల్ గా వీరి వివాహ వేడుక జరుగుతుందని తెలుస్తోంది. ఈ వార్తకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News