Sunday, March 23, 2025

కీర్తితోనే ఆటలా.. ఐస్‌క్రీమ్ వెండర్‌కి చుక్కలు చూపించింది..

- Advertisement -
- Advertisement -

టర్కిష్ ఐస్‌క్రీమ్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఐస్‌క్రీమ్ మన చేతికి ఇచ్చినట్లే చేస్తూ.. అది ఇవ్వకుండా ఆటపట్టిస్తుంటారు ఈ ఐస్‌క్రీమ్ అమ్మేవాళ్లు. ఇందుకు సంబందించిన వీడియోలు సోషల్‌మీడియాలో చాలానే చూసి ఉంటాం. ఇప్పుడు అలాంటి పరిస్థితే నటి కీర్తి సురేష్‌కి ఎదురైంది. అయితే కీర్తి కూడా అందుకు ధీటుగా జవాబిచ్చింది.

షాపులో వ్యక్తి ఐస్‌క్రీమ్ ఇవ్వకుండా కీర్తి సురేష్‌తో చాలా సేపు అటపట్టించాడు. అయితే కొంత సమయానికి ఐస్‌క్రీమ్‌ని ఆమెకు ఇచ్చేశాడు. అయితే ఆ తర్వాత కీర్తి ఆటను ప్రారంభించింది. ఐస్‌క్రీమ్‌కి ఇవ్వాల్సిన డబ్బులు షాపు అతనికి ఇవ్వకుండా కాసేపు ఆడుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. దానికి ‘జస్ట్ ఫర్ ఫన్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. వరుణ్ ధవన్‌తో కలిసి ‘బేబి జాన్’ అనే సినిమాతో కీర్తి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె ‘రివాల్వర్ రీటా’, ‘కన్నివేడి’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News