Saturday, January 4, 2025

15 ఏళ్లుగా అతనితో రిలేషన్‌షిప్‌.. కీర్తి సురేష్ కు శుభాకాంక్షల వెల్లువ

- Advertisement -
- Advertisement -

తన ప్రేమ వ్యవహారంపై హీరోయిన్ కీర్తి సురేష్ స్పందించింది. అది నిజమేనని ప్రకటించి అందిరికి షాకిచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ అంటోనితో రిలేషన్‌షిప్‌ గురించి తాజాగా అధికారిక పోస్ట్ చేసింది. 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని తెలిపుతూ.. తన ఇన్ స్టాగ్రామ్ లో దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనితో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేసింది. దీంతో తర్వలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కీర్తి సురేష్ కన్ఫామ్ చేయడంతో పలువురు సినీ ప్రముఖులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా, ఆంటోనితో కీర్తి సురేష్ ప్రేమలో ఉందని.. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. గోవాలో వచ్చె నెలలోనే కీర్తి తన బాయ్ ఫ్రెండ్ ను వివాహ చేసుకోనున్నారని, ఇప్పటికే పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయని నెట్టింట వార్తలు చెక్కర్లు కొట్టాయి. తాజాగా కీర్తి సురేష్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు కూడా కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News