మహానటి మూవీతో హీరోయిన్‌గా గొప్ప పేరుతో పాటు ఏకంగా ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం సొంతం చేసుకున్నారు అందాల తారా కీర్తిసురేష్. టాలీవుడ్‌కి నేను శైలజ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన కీర్తి, ఆ మూవీలో తన ఆకట్టుకునే అందం అభినయంతో ఆడియన్స్ మనసు దోచారు. అక్కడి నుంచి వరుసగా అనేక సినిమా ఆఫర్స్ అందుకుంటూ వాటితో పలు సక్సెస్‌లు సొంతం చేసుకుంటూ దూసుకెళ్తోంది కీర్తి సురేష్. నాచురల్ స్టార్ నానితో కలిసి ఆమె నటించిన దసరా. మాస్ యాక్షన్ రస్టిక్ ఎంటర్టైనర్‌గా రూపొందింది.
ఈ మూవీకి శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించారు. ఈ మూవీలో ధరణి పాత్రలో నాని అలానే వెన్నెల పాత్రలో కీర్తి కనిపించనున్నారు. భారీ అంచనాలతో ఈ మూవీ మార్చి 30న పాన్ ఇండియా రేంజ్‌లో పలు భాషల్లో విడుదల కానుంది. అయితే శనివారపు సాయంత్రాన్ని సరదాగా ఎంజాయ్ చేస్తున్న వెన్నెల అంటూ దసరాలోని మాస్ చీరకట్టు లుక్‌ని సోషల్ మీడియా పోస్ట్ చేసారు కీర్తిసురేష్. ప్రస్తుతం ఈ ఫొటో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ ఫొటో సోషల్ మిడియాలో వైరల్ అవుతోంది.
Vennala’s Saturday night looks like! 💙🌶️
Less than 5 days to go #Dasara pic.twitter.com/iu3zhww8wK
— Keerthy Suresh (@KeerthyOfficial) March 25, 2023