Sunday, January 19, 2025

కీర్తి సురేశ్ పెళ్లి చేసుకునేది ఇతడినే!

- Advertisement -
- Advertisement -

యంగ్ బ్యూటీ కీర్తి సురేశ్ పెళ్లి త్వరలోనే పీటలెక్కబోతోంది. తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోనీ తట్టిల్ ను కీర్తి వివాహం చేసుకోనున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 14 ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. కేరళలోని కొచ్చికి చెందిన ఆంటోనీ, కీర్తి సురేష్ స్కూల్ డేస్ నుంచి స్నేహితులుగా ఉన్నారని.. తర్వాత అది ప్రేమగా మారినట్లు సమాచారం.

ప్రస్తుతం ఆంటోనీ బిజినెస్ మెన్ గా రాణిస్తున్నాడు. ఎట్టకేలకు వీరిద్దరూ ఏడడుగులు వేయబోతున్నారట. డిసెంబర్ 11, 12 తేదీల్లో గోవాలో వీళ్ల పెళ్లి జరగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కీర్తి సురేశ్ పెళ్లి పనులు గోవాలో మొదలయ్యాయట. కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరగనుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News